పువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో!  పద్దాలు చిన్న బాలిక.  వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోయిన తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది.  ''అమ్మా! యియాళ ఎన్ని పూవులు దొరికాయో!  ఏంటనుకున్నావు.  ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా'' అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.
''మల్లెలు మల్లెలు కాడల మల్లెలు
జల్లులు జల్లులు తెల్లని మల్లెలు''
అని ఓ పాట సంపూర్ణమైన యాసతో పాడుతూ ఆ బుట్టను తన హృదయానికి అదుముకొని 'ఓ లమ్మా! జడయెయ్యవంటే?'' అని తల్లిని ప్రశ్నించింది.
ఇంక ఏమి పువ్వులుంటాయి ఆమె ఈ చిన్ననాటి జీవితంలో!  వాళ్ళయ్య పనిచేసే దశరథరామిరెడ్డి పొలంలో సంక్రాంతి రోజులలో వికసించే బంతి పూవులూ, బొడగ బంతిపూవులూ, సీతమ్మవారి జడపూవులూ, బంగారం ముద్దలు, పొద్దుపొడుపు పూవులూ.......

Write a review

Note: HTML is not translated!
Bad           Good