''జైలు లోపల'' కథల్లో మొదటి కథ 'పరిగె'. తెలంగాణ పల్లెలో సామాన్యుని జీవితం ఎంత దీనంగా వుండేదో ఈ కథ చెప్తున్నది. వెట్టిచాకిరి చేసే కింది కులాల వాళ్ళకు వాళ్ళ పొట్ట పోసుకోవటానికి సమయముండేది కాదు. గ్రామంలోని దొరలకు, గ్రామాధికారులకు, దౌరాలకు వచ్చే ప్రభుత్వోద్యోగులకు జీతబత్తాలు లేకుండా పనులు చేయాలి. ఈ కథలో మల్లయ్య ఖానాపురంలో వంతు మాదిగ. కూతుర్ని కని తల్లి చనిపోయింది. జీవితమంతా వెట్టిచాకిరి చేసి కండలు కరిగించిన తండ్రి మంచం పట్టాడు. ప్రేమతో పెంచి పెద్ద చేసిన చెల్లెలుకు, తండ్రికి ఇంత తిండి పెట్టని స్థితిలో వున్నాడు మల్లయ్య. ఒకరోజు మల్లయ్య వెట్టిచాకిరికి పోయి సాయంత్రం వచ్చాడు. ఆకలితో మలమల మాడుతున్న తండ్రికి, చెల్లెలుకు తినటానికి ఏమైనా గింజలు సంపాదించి తెస్తానని బయలుదేరిన మల్లయ్య ఒక చేనులో పరిగె కర్రలను పోగు చేసుకొని కట్ట కట్టుకొని సంతోషంగా బయలుదేరుతాడు. ఇంతలో ఆజానుబాహువైన రైతు వచ్చి తన కల్లంలోంచి ధాన్యం కట్టలను దొంగిలించాడని పోలీసుపటేలుకు అప్పజెప్తాడు. చెల్లెలును ప్రక్క గ్రామానికి వంతుకు పంపి పోలీసుపటేటుల మల్లయ్యను పోలీసులకు అప్పజెప్పాడు. మల్లయ్యకు దొంగతనం నేరం కింద మూడు నెలల జైలుశిక్ష పడ్తుంది. జైలులో వున్నప్పుడు తండ్రి మరణించాడని చెల్లెలు ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇల్లు పాడుపడిందని మల్లయ్యకు తెలుస్తుంది. ఆ వార్త విని మల్లయ్య గత్యంతరం లేక పెద్దగా ఏడుస్తాడు. తపిస్తాడు. అదీ! ఖైదీ మల్లయ్య జీవితం!.....

Pages : 78

Write a review

Note: HTML is not translated!
Bad           Good