ఆగ్రా నగరంలో అత్యంత శోభాయమానంగా వెలిగిపోయే దివ్య మందిరాల మధ్య వుంది శీష్‌మహల్‌ ! రాజదంపతులు, బేగములు వంటి ప్రాముఖ్యం గల స్త్రీలు అంతా అందులోనే జలకాలాడుతుంటారు. చంద్రకాంత శిలలతో నిర్మితమయి, ముత్యపు చిప్పలతో, నవరత్నాలతో అలంకరించబడి చూడటానికి ఎంతో అందంగా వుంటుంది.

సహస్ర బాహువులు వున్న దీపాలకుండీ పై నుంచి వేలాడుతోంది. అందులో వున్న జలాశయం చాలా విశాలాంగా వుంది. మధ్యలో వున్న జలస్తంభం నుంచి సుగంథాలు కలిపిన పన్నీరు నిరాటంకంగా, శంకరుని జటాజూటంనుంచి వెలువడే గంగా తరంగిణిలా ఎగజిమ్ముతోంది.

జలాశయం చుట్టూ చంద్రకాంత శిలావేదికలున్నాయి. అందులో కొన్ని ముఖ్‌ముల్‌ దిండ్లతో అలంకరించబడి వున్నాయి. జలకమాడవచ్చిన స్త్రీలు వాటిపై కూర్చుని వుంటే వారి దేహాలకు సుగంధాలను పూసి, మర్థనా చేస్తారు పరిచారికలు. తర్వాత ఆ జలాశయంలో స్నానమాడి, నూతన రత్నాంబరాలు ధరించి, అక్కడ విశ్రమిస్తారు.

సమస్త భోగాలకూ అలవాలమై వుండే ఆ భవనం తీవ్ర ఆలోచనలతో సతమతమయ్యేవారు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం.....

పేజీలు : 264

Write a review

Note: HTML is not translated!
Bad           Good