పదపదమంటూ పదాల పడవల మీద

పోరాటానికి బయలుదేరిన సాహసికుడితడు

ఈ బల్‌ రైఫిల్‌ పదాల స్వరాలలోంచి

గుండెలను అమాంతం పేల్చగలడు

అన్నింటినీ నిట్టనిలువునా పట్టపగలే కూల్చగలడు

అతనొక ఆకాశనీలిమ, అరుణిమలతో

ఆవేదనలని, అశ్రువులను ఆసాంతం హరించేందు

శివమెత్తిన సాగరం.

ఆయన కవిత్వం విప్లవ విముక్త రూపక సముద్రం

ఆయన పదం ఆధిక్య, అణచివేతలపై ఎక్కుపెట్టి ధిక్కార స్వరం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good