ఆధ్యాత్మికత పేరుతో నిలువుదోపిడి చేసే వ్యవస్థ వలన ప్రజాస్వామ్య పరిరక్షణ ఇబ్బందుల పాలవుతున్నది. ఆ కారణంగా సామాన్య ప్రజలు తమ సంస్కృతిని తత్త్వాన్ని మరచిపోయి క్రొత్త క్రొత్త ఆచార వ్యవహారాలకు అలవాటు పడిపోవడం జరుగుతున్నది. దీనివలన యువత అనేక దురలవాట్లకు, అసాంఘిక చర్యలకు అలవాటుపడి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు.

ఆ కారణంగా తల్లిదండ్రుల, బిడ్డల మద్య మానవ సంబంధాలు చెడిపోవడం ప్రస్తుత సమాజంలో సర్వ సాధారణమైంది. ఈ రుగ్మతలనుండి బయట పడడానికి చట్టాలను తుంగలో తొక్కే వ్యవస్థను మార్చడం ప్రస్తుత ప్రజాస్వామ్యం యొక్క ప్రధమ కర్తవ్యం. ఈ విషయాన్ని ఒక కథావస్తువుగా మలిచి సమస్యలను అధిగమించేందుకు దారితెన్నులను చూపే క్రొత్త ఆలోచనతో రాజ్యాంగంలో మార్పులకు చేర్పులకు శ్రీకారం చుట్టడానికి ఆచార్య శేషయ్య గారి జగన్నాటకం నవలలో రాజ్యాంగం నమూనా చాలా ముదావహంగా ఉంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దీని అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి సంకోచించాల్సిన పని లేదు. ఈ కథా వస్తువు కొత్త ఆలోచనలకు తెరతీస్తుందనడంలో సందేహం లేదు. శుభం భుయాత్‌.

- శ్రీమతి జి.శ్రీదేవి

తెలుగుభాషోద్యమ సమితి అధ్యక్షులు, తిరుపతి

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good