అందమైన శిల్పాన్ని చేక్కినట్లుండే అద్బుతమైన పనివాడి  తనం తో , ముగ్ద మనోహర మైన ముఖానికి ముచ్చటైన తిలకంలాంటి సింగారం తో, లోపలి పేజీల్లోకి పరుగు తీయకుండా మొదటి పేజీకి కళ్ళుఅప్పగించేలా చేశారు. జగన్నాధ శర్మ ' గుండె గుప్పెడంత ఊహ ఉప్పెనంత అన్న కవి మాటను నిజం చేస్తూ జగనాద శర్మ నవ్య వీక్లీ ఎడిట్ పేజీలో వారం వారం రాస్తున్న కథలు పాఠకుల్ని కదిలిస్తున్నాయి. కరిగిస్తున్నాయి. దర్శనా నంతరం గుడి మెట్ల మీదే కాసేపు కూర్చునేటట్లు కథ చదవడం పూర్తీ చేసిన తర్వాత గబుక్కున పీజీ తిప్పెయకుండా అదే పేజిలో అక్షరాలని చూపులతో తడిమి, హృదయంతో ఆలోచించేలా చేస్తున్నాయి. అలాంటి వాటిలో అనేకుల మెచ్చిన అత్యుతమ మైన 100 కథల్ని ఎంపిక చేసి, ఏర్చి కూర్చిన ఈ సంకలనం విభిన్న పార్వల జీవిత గుచ్చం. ఇందులో ప్రతీ కోణం మిమ్మల్ని పలకరిస్తుంది. మీ హృదయాల్ని కథ చక్రాల్లా పరుగులు తీయిస్తుంది. 

జగన్నాథ రథచక్రాలపేరుతో మరో భాగం కూడా వచ్చింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good