తరతరాల చీకటిని చీల్చుకొని పరాధీన భారతజాతి పునర్జన్మే స్వాతంత్య్రం. అసంఖ్యాక ప్రజల కన్నీళ్ళతో, రక్తంతో తడిసిన ఈ గడ్డపై పోరాట వీరుల ప్రాణవాయువులే స్వేఛ్చావాయువులయ్యాయి. స్వాతంత్య్ర సమరాన్ని నడిపి లాఠీదెబ్బలు తిని చెరసాల పాలై ఊపిరి పూలు రాల్చిన త్యాగమూర్తులు ఎందరెందరో... ఆనాటి దేశభక్తుల ఆదర్శ జీవిత రేఖల్ని మననం చేసుకోవటం, ఆ స్ఫూర్తిని అందుకోవటం, ముందు తరాలకు అందించటం మనందరి కర్తవ్యం. అందుకే ఈ జాతి వెలుగులు. ఆ వెలుగుల్లో మన భారత జాతి ఇంకా ప్రకాశవంతం కావాలి...

Write a review

Note: HTML is not translated!
Bad           Good