బాపురెడ్డి సాహిత్యాత్మ చేతనను ఆవిష్కరించే గొప్ప గ్రంథం ఇది. విశ్వవిఖ్యాత పారిశ్రామికవేత్తయేగాక, సామాజిక, విద్యా, వైద్య, నిర్మాణ, విద్యుత్తు, క్రీడలు, పర్యాటక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సేవలు అందిస్తున్న శ్రీ జి.వి.కృష్ణారెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి ఇందిర గారికి ఈ గ్రంథాన్ని అంకితం చేయడం ఎంతో ఆదర్శవంతం. -ఎ.వి.ఎస్‌.రాజు
మా తర్వాతి తరం కవుల్లో పద్యాన్ని పట్టుకున్న వాళ్ళు అరుదు. పట్టి, అంచులు ముట్టినవాళ్ళు వేళ్ళు దాటిపోరు. బాపురెడ్డి పద్య విద్యామర్మజ్ఞుడు. ప్రౌఢ పద్యకవుల పంక్తితో కూర్చునే పద్యాలు ఎన్నెన్నో రాశాడు.  - డా. సి.నారాయణరెడ్డి
విదేశాలకు వెళ్లే వాళ్ళందరు మొత్తంమీద ఏదో ఒకటి పోగొట్టుకుని వస్తారు. బాపురెడ్డి మాత్రం అక్కడక్కడి అపూర్వ సౌందర్యాలన్నింటినీ మూటట్టుక తెచ్చి తెలుగు సరస్వతికి అమూల్యాభరణాలుగా కూర్చి తీర్చిదిద్దాడు. - డా. బోయి భీమన్న
మహాకవెలెవ్వరూ సమన్వయం చెయ్యని, సందేశం లేని కావ్యాలు వ్రాయలేదు. బాపురెడ్డి గారు తన కవిత్వానికి సమన్వయం ప్రాణంగా చేసుకోగలిగాడు. అందువల్లనే ఈయన కవిత్వంలో దేహానికి, మనస్సుకు, బుద్ధికి సముచిత స్ధానాలు లభించడమే కాకుండా చాలా మంది ఆధునిక కవులలో కనబడని అతీంద్రియమైన ఆత్మవస్తువుతో వీటికి సమన్వయం చేసే ప్రయత్నం కనబడుతుంది. - ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good