పరాధార చరమాంక చలనంలో ఈదులాడుతూ

హఠాత్తుగా ఏదో ఒక ఘనీభూతసరస్సులో

నిశ్చేష్టంగా నిలువునా చిక్కుకుపోయినట్లు..

నడిచివచ్చిన దారులతో పాటు

నడవవలసిన దారులు కూడా

అన్నీ మూసుకుపోయినట్లు,

సకల దశలలో సాగరతీరదీపగోపురాలై

రారమ్మని నన్ను లోనికి లాక్కున్న

దశదిశలు నా కళ్లముందే అదృశ్యమైనట్లు,

మస్తిష్కతటాకంలో

పొంగిపొర్లడానికి తన్నుకులాడుతున్న

తీవ్రభావనలకి

నేనొక లిపిలేని భాషనయినట్లు,

గగనగృహద్వారంలో ఒకరె..వ..రో నా కోసం

గోరింట చేతులలో నక్షత్రమాల పట్టుకుని

వెన్నెల కళ్లతో యెదురుచూస్తున్నట్టు,

అ..ప్పు..డు.. ఏమరపాటుగా వున్న

నన్ను ఎవరో మెలకువగట్టునుంచి

నిద్దురయేటిలోకి బలంగా తోసినట్టు..

అ..ప్పు..డు..!

పేజీలు : 172

Write a review

Note: HTML is not translated!
Bad           Good