ఈ పుస్తకంలో ''ఇన్ఫెక్షన్స్'' గురించి, వాటిలోని రకాల గురించి అవగాహన కలగడమే గాక, ఇన్ఫెక్షన్స్ పట్ల కనీస పరిజ్ఞానాన్ని పొందుతారు. మామూలుగా ప్రజలు మాట్లాడుకునే సమయంలో ''బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్'' అనీ, ''వైరల్ ఇన్ఫెక్షన్స్'' అని అంటారే గాని, వాటివల్ల వచ్చే వ్యాధుల గురించి, వాటికి వాడే ''యాంటి బయాటిక్స్'' గురించి అవగాహన కలిగి వుండరు. అలాగే కామెర్లు, టైఫాయిడ్, టి.బి., జ్వరాలు లాంటివే కాకుండా ''హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్'', ''మలేరియా'', ''డెంగ్యూ'' జ్వరాలు మొదలైన వాటి గురించి కూడా సామాన్య ప్రజలు ఎక్కువగా అవగాహన కలిగివుండరు. వారి అవగాహన పెంపుదలకు ఈ పుస్తకంలో తగిన విధంగా సమాచారాన్ని రచయిత్రి అందించారు.
ఆయా వ్యాధుల పర్యావసానాలు, వాటి నివారణోపాయాలు ఈ పుస్తకంలో రచయిత్రి డా|| కె.ఉమాదేవిగారు సామాన్యులకు సహితం అర్థమయ్యే రీతిలో వివరించారు.