దేశ సమగ్రతకోసం
ఆఖరి రక్తపుబొట్టు వరకూ ధారపోస్తా...
ఇవీ మన ప్రియతమ నేత ఇందిరాగాంధి ఆఖరి ప్రసంగంలో మాట్లాడిన మాటలు. మాటల్లోనే కాక ఆచరణలోనూ ఆ జన్మాంతం పేదప్రజల సంక్షేమం, దేశ సమగ్రతా పరిరక్షణ ప్రధాన సూత్రాలుగా పనిచేసి, 'దేశానికే అమ్మ'గా గౌరవం పొందిన ఖ్యాతి ఆమెది.
సామ్యవాదులైన మేధావులు, దేశప్రేమికులైన లౌకికవాదులు, సమైక్యవాదులైన రాజకీయ విశ్లేషకులు ఆమెను ధైర్యసాహసాలకు ప్రతీకగా సగౌరవంగా ప్రస్తావించేవారు. అమెరికా, రష్యా, చైనా తదితర అగ్రదేశాల అధ్యక్షులు, అలీనదేశాల ప్రజలు మేధావులు ఆమె అభిప్రాయాలను గౌరవించేవారు.
సమాచార విప్లవాలు, ప్రచార పటాటోపాలు లేని ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అంత పేరు తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆమె విధానాలు, ఆమె సాధించిన విజయాలు భారతదేశ ఖ్యాతిని ఎల్లలు లేకుండా ప్రపంచ వ్యాప్తం చేశాయి.
సంక్షేమాన్ని అభివృద్ధినీ అద్భుతంగా సమతుల్యం చేసిన మొట్ట మొదటి నాయకురాలు ఇందిరాగాంధీనే. నేటి తరం యువకులలో ఇందిరాగాంధీ పట్ల తగిన ఆసక్తిని రగిలించి, ఆమె గురించి అధ్యయనం చేయాలనే సంకల్పం కలిగించడమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం.