ఈ 'ఇండియన్‌ (నవలికలు)'లో అగ్గిపుల్లలు, ఇండియన్‌, ఎడిటర్‌, హిమపుత్రి, ఎరికా అనే ఐదు నవలలు ఉన్నాయి.

'ఎరికా' హంగేరి నేపథ్యంగా వ్రాసిన నవల. ఈ నవలలో తూర్పు యూరోపుకు సంబంధించిన హంగేరియన్‌ శాస్త్రరంగ సామాజిక జీవిత నేపథ్యం. హంగేరియన్‌ భౌగోళిక సౌందర్యంతో బాటు నదులూ, సరస్సులూ వాటి ఉపయోగమూ రాజకీయాలూ, దాంపత్యాలూ, ప్రేమలూ, పరదేశీయులతో వ్యక్తులు వ్యవహరించే తీరుతెన్నులూ, పదదేశీయుల అనుభూతులు నేపథ్యంగా కనిపిస్తాయి. ఒక భావుకుడైన వ్యక్తి వాటిలో ఇమిడీ ఇమడని లక్షణాన్ని చందూ చిత్రించాడు.

అట్లాగే 'హిమపుత్రి' నవలకు నేపాల్‌ నేపథ్యం. విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో భూవిజ్ఞానశాస్త్రం చదివిన రాజవంశీకురాలితో మౌనంగా మానసిక అనుబంధం ఏర్పరచుకున్న ఒక సహాధ్యాయ తన సహాధ్యాయ మిత్రులతో నేపాల్‌ వెళ్ళటం నేపథ్యం. నేపాల్‌ ఆచార వ్యవహారాలతో పాటు రాజకీయాలూ, మతం, ఆచారాలు, కట్టుబాట్లూ, వాస్తు నిర్మాణాలూ, భూ భౌతిక శాస్త్రసంబంధ విషయాలూ, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన సమస్యలు నవలలో అంతర్భాగాలయ్యాయి.

ఎడిటర్‌ నవలలో శృంగారం, అశ్లీలత అనబడే పోర్నోగ్రఫీల గురించి చందూ చర్చించాడు.

మత విషయాల్లో అగ్రవర్ణ అగ్రమత దురహంకారాన్ని చందూ అసహ్యించుకుంటాడు. ఈ ప్రాపంచిక ధోరణి 'ఇండియన్‌' నవలలో ఇతివృత్తంలో భాగం చేశాడు. మహామిశ్రమ సంస్కృతి నుంచే సమతాప్రపంచానికి కావలసిన సాంస్కృతిక నేపథ్యం తయారవుతుందని చందు విశ్వాసం. మైకేల్‌ ఫెర్నాండేజ్‌ - దేవి వివాహానంతరం పుట్టేబిడ్డ ఈ దేశౄనికి నిజమయిన వారసుడనే సందేశం ఈ నవలలో కన్పిస్తుంది. దేవి బ్రాహ్మణ యువతి.

Pages : 272

Write a review

Note: HTML is not translated!
Bad           Good