ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

యిల్లు కట్టి చయూడు - పెళ్ళి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండు కావ్యాలలో అంచనాకు మించిన ఖర్చులే కృంగదీస్తాయి.

నారాయణరావు తనకు తండ్రి ఆస్తి ఏం మిగల్చలేదని బాధపడతాడు. తను తండ్రిలా కాదు. నా పిల్లలకు లక్షలు సంపాదించకపోవచ్చు. కాని వాళ్ళు నిశ్చింతగా బ్రతకడానికోదారి కల్పించాలి. నా కొడుక్కు నా సంపాదనతో అధునాతనమైన ఇల్లు కట్టి, ఫర్నీచర్‌ అమర్చాలి. నా కూతురిని సంగీత సరస్వతిని, నాట్యమయూరిని చేయాలి. అందరూ శభాష్‌ అనేలా వివాహం చేయాలి. డాక్టరు, ఇంజనీరు అని చాలా మంది అనుకుంటారు. అలా కాదు. కలెక్టర్నీ లేదా ఇండస్ట్రీయలిస్ట్‌ని అల్లుడిని చేస్తాను. అనుకునే నారాయణరావు పిల్లలు భిన్నమార్యాలలో వెళ్ళారు. యెందుకిలా జరిగింది?

ఆశ అత్యాశ కాకూడదు. ఆశయం స్వార్ధానికి ముడిపడరాదు. అన్నిటికన్నా ముఖ్యం క్రమశిక్షణ, లక్ష్యసిద్ధి. చిత్తశుద్ది తనకు లేవని తెలుసుకునే నాటికే పరిస్థితులు చేయిజారాయి.

నారాయణరావు యెలా నిలదొక్కుకున్నాడు?... యిల్లు కట్టేడా? పెళ్ళి చేసేడా?...

పేజీలు : 274

Write a review

Note: HTML is not translated!
Bad           Good