ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'.

ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉపకరిస్తాయనీ నమ్మదగ్గ పెద్దలు (చదివిన వారు) చెప్పగా విన్నాను. నమ్ముతున్నాను. నిజానికి మన గతాన్ని విమర్శనాత్మకంగా స్వీకరించాలి. 

ఈ కథల్లో మనుషుల వేదనలున్నవి. ఆనందాలున్నవి. ఆవేశాలున్నవి. మనుషుల గురించిన ఆదర్శాలున్నవి. అనకాపల్లి నుంచీ అమెరికాదాకా మనుషుల అనుభవాలకు సంబంధించిన అనేక సంఘటనల మీద తమదయిన రీతిలో అయిదుగురూ కథలు రాసేరు. ప్రాంతీయ సమస్య, స్త్రీ సమస్య, కుల సమస్య, రాజకీయాలు, మార్కెట్‌, అభివృద్ధి పేరిట అమలయే విద్వంసం... అన్నీ వీరి కథా వస్తువులయినవి.

తనను అగ్నిసాక్షిగా పెళ్ళాడి, యేడడుగులే కాదు యెన్నో అడుగులు నడచి, పిల్లల్ని కనీ, పెంచీ తనకు నీడలా నడిచే భార్యపట్ల భర్త కనబరచే నిరాదరణకు సంబంధించి కొత్తగా కథనం చేసిన 'బేడ్‌ హజ్బెండ్‌' (గోటేటి లలితా శేఖర్‌).

వ్యవసాయం జూదం కాగా బతుకంతా ఓడిపోయే రైతు జీవితాన్ని ఆర్తిగా చిత్రించిన 'నాయనా నువ్వు చచ్చిపోవద్దే' (తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం). చిత్రంగా యీ రెండు కథల్లో పిల్లలు, భవిష్యత్‌ తరం వారు పరిష్కార బాటను చూపేరు. 

సకలం బంద్‌ చేసి చదువే సర్వస్వం చేసి, అమెరికావేపు బాల్యంలోనే అడుగులు వేయించేందుకు సంతానాన్ని హింసించే తల్లిదండ్రుల నేపథ్యంలో కథగాగాక ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచనలు కదల్చే కథ 'కనువిప్పు' (నామని సుజనాదేవి). 

ఇలా జీవితంలోని వివిధ సందర్భాల, వివిధ వ్యక్తిత్వాల మంచి చెడ్డలను మనతో యీ కథలన్నీ పంచుకున్నాయి. అవి ఎంత శిల్ప పరమయిన సౌందర్యాన్ని ప్రదర్శించేయి, ఎంతటి ఉత్కంఠతను రేకెత్తించాయన్న విశ్లేషణ కంటే వీరి సామూహిక దీకక్షూ, జీవితానికి సంబంధించిన వీరి దృష్టి కోణానికీ మనం అభినందించాలి. - అట్టాడ అప్పల్నాయుడు

Pages : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good