మానవులు వున్నది, ''మానవ సమాజమే'' అవుతుంది. అయితే, ఆ సమాజంలో వున్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, ''ఇది మానవ సమాజమేనా?'' అనే ప్రశ్న రావలిసి వుంటుంది.

సమాజంలో వున్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్ట మొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి వుంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ఈ సమస్య, అట్టడుగు కులపు హిందూ స్త్రీ పురుషుల్నీ, అతి బీద స్థితిలో వున్న ముస్లిం స్త్రీ పురుషుల్నీ, కొన్ని తెగల ఆదివాసీ స్త్రీ పురుషుల్నీ, యజమానుల ఇళ్ళల్లో వుండే పాయిఖానా దొడ్లలోని మలమూత్రాల్నీ తమ స్వంత చేతులతో ఎత్తివేస్తూ శుభ్రాలు చేసే 'పాకీ చాకిరీ'కి కట్టిపడేస్తుంది!

''పాకీ చాకిరీ'' అనే దాన్ని, రోడ్లని వూడ్చే పని లాగానో, చచ్చిన జంతువుల్ని పాతిపెట్టే పని లాగానో, జమ కడితే, పాకీ పనిలో వుండే బాధల్నీ, అవమానాల్నీ, దు:ఖాల్నీ, అర్థం చేసుకునేదేమీ వుండదు. ధనిక మానవుల ఇళ్ళల్లో కుక్కలూ పిల్లులూ వుంటే, వాటి మల మూత్రాల్ని ఎత్తడం కూడా ఆ ఇంటి సేవకులైన బీద మానవుల పనే కదా?

మానవ జీవితంలో, 'వంటిల్లు' ఎంత అవసరమో, 'పాయిఖానా దొడ్డి' కూడా అంత ముఖ్యమైన అవసరమే కదా? ఆహారానికి చివరి రూపాలే, మల మూత్రాలు కదా? దొడ్డి సమస్యని పరిశుభ్రంగా పరిష్కరించు కోవడం సమాజం బాధ్యతకాదా?

అందుకే మరి, పాత కాలపు 'శ్రమ విభజన'లో మార్పులు జరగాలనడం! అసలు మొదట, ఎవరింట్లో లెట్రిన్లని వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. అది మొదట! చివరి సెప్టిక్‌ ట్యాంకుల సంగతా? ఆ శుభ్రాల్ని యంత్రాల్ని ఉపయోగిస్తూ చేసినా, ఆ పని అన్ని కులాల వాళ్ళూ డ్యూటీల ప్రకారం చెయ్యాలి. అలా కాకుండా ఆ పెద్ద ట్యాంకుల్ని శుభ్రం చెయ్యవలిసింది అయినా, పాకీ కులం వారే అయితే, ఇక అది ఏం మార్పు? ఆ ట్యాంకుల బాధ్యత అందరిదీ కాదా?

పేజీలు : 150

Write a review

Note: HTML is not translated!
Bad           Good