శంకరం ఒక్క క్షణం ఆగి శేషయ్య వైపు నిర్వికారంగా చూశాడు. "నువ్వు అన్నార్తుడివై, అనాధుడివై, మా యింటి కొచ్చావు. మా గుమ్మం ఎక్కి 'దేహి' అన్న వాళ్ళెవరూ నిరాశతో వెళ్ళకూడదు. పిడికెడు బిచ్చం పెట్టటానికి వాడి గత చరిత్రతో మాకు సంబంధం లేదు. దాన ధర్మాలు చేసే మానవత్వం మాకు వుంది. ఈ వృద్ధాప్యంలో నిన్ను ఆదరించే వాళ్ళెవరూ లేరని తెలుసు నాకు. నీ పోషణకి ఒక దానంగా, ఒక విరాళంగా, కొంచెం డబ్బు పంపిస్తూ వుంటాను. అంతకు మించి నీ కోసం కన్నబిడ్డగా నే నేమీ చెయ్యను. ఇదే, నా న్యాయం! ఇక ముందేప్పుడూ నా తండ్రి హోదాతో ఈ ఇంటికి రాకు!" అని చటుక్కున వెనక్కు తిరిగాడు శంకరం.

"మాలా! ఆకలితో వున్నడేమో! ఈ వరండాలోనే ఆకు వేసి అన్నం పెట్టి, డబ్బు ఇచ్చి పంపించు" అని చెప్పి నిర్వికారంగా లోపలికి వెళ్ళిపోయాడా మానవుడు శంకరం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good