ఐ.వెంకట్రావ్ రాసిన 'ఒకే ఒక్కడు' పుస్తకంపై మే 2002 సంచికలో దుమ్ములేపిన సమీక్ష.
ఐ.వెంకట్రావు రాసిన 'ఒకే ఒక్కడు' పుస్తకం మీద 16 సంవత్సరాల ర్కతం 'విజయవిహారం' (మే 2002 సంచిక)లో 'రాజేశ్వరి' అనే కలం పేరుతో ... నేను రాసిన సమీక్ష వెలువడినపుడు కలిగిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఎందరెందరో... తెలుగు పాత్రికేయులు, మేధావులూ, ఉద్యమకారులూ...ఈ సమీక్షని అభినందించారు. గుండెకి హత్తుకున్నారు.
ఐ.వెంకట్రావుని తెలుగు జర్నలిజానికి దిగ్గజంగా పరిగణిస్తారు. ఆయన ఒక దినపత్రికకి సుదీర్ఘకాలం ఎడిటర్‌గా ఉన్నారు. అటువంటి సుప్రసిద్ధ పాత్రికేయుడు 'ఎన్టీఆర్' వంటి లెజెండ్ జీవిత చరిత్రని రాసినపుడు,.. అది నిష్పాక్షికంగా, సమున్నత ప్రమాణాలకి అనుగుణంగా ఉంటుందనే ఎవరైనా ఆశిస్తారు.
దురదృష్టవశాత్తు... 'ఒకే ఒక్కడు' పుస్తకం అందుకు భిన్నంగా ఏకపక్షంగా సాగిందనీ, అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలకీ, సూత్రీకరణలకీ పాల్పడిందని నాకు అనిపించింది.....
పేజీలు : 30