డబ్బు... డబ్బు... డబ్బు...

డబ్బు లేనిదెక్కడ!

నీ జేబులో లేకపోవచ్చు! కాని అది నీ మనసులో వుంది. డబ్బు ప్రతిఒక్కరి జీవితంలో భాగం కాబట్టి జీవితంలోనూ భాగమే. డబ్బుకు అందరి దృష్టినీ ఆకర్షించే విశిష్టమయిన శక్తివుంది. ఈ మాట నమ్మకపోతే డబ్బుకున్న శక్తిని పరీక్షించేందుకు ఒక పని చేయండి. మీచేతిలోని రూపాయి నాణేలను ఒకటి రెండింటిని నేలమీద శబ్దం చేస్తూ దొర్లిపోయేలా వదలండి. ఆ తర్వాత అక్కడున్నవారి ప్రతిస్పందనలు జాగ్రత్తగా గమనిస్తే ఆశ్చర్యపోతారు.

ఆ శబ్దం విన్న ప్రతిఒక్కరూ తమ మాటలు, చేతలు ఆపేసి ఒక్కసారిగా తలను శబ్దం వచ్చినవైపు తిప్పుతారు. ఆ శబ్దం వచ్చిన ప్రదేశంవైపు కళ్లు విప్పి చూస్తారు. అంతేకాదు ఆ పడిన నాణేలు తమ జేబులోనివి కాదు కదా అని ఆశ్చర్యపోతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good