తెలంగాణా సాయుధ పోరాటం అనంతరం హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమా?, విముక్తా?, విద్రోహమా?, అనే అంశంపై రాజకీయ పార్టీల్లో, మేధావుల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది.
హైదరాబాద్ రాష్ట్రం
అసఫ్జాహీ వంశ వారసుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ హైదరాబాద్ రాజ్యాధినేతగా పాలిస్తున్న రాష్ట్రం.
హైదరాబాద్ దేశంలోని 610 సంస్థానాల్లో అతి పెద్దది. వాస్తవానికది స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతున్నది. 200 సంవత్సరాలుగా అసఫ్జాహీ వంశపాలన సాగుతున్నది. రాష్ట్రానికి సరిహద్దులు, సరిహద్దు సుంకం, స్వంత సైన్యం, స్వంత కరెన్సీ, తపాలాబిల్లా, కోర్టులు, జైళ్ళు, రైళ్లు, బస్సు, రేడియో, స్వతంత్ర రాజ్యానికి ఉండే అన్ని హంగులున్నాయి. నిజాం ప్రభువు, ప్రభుత్వ శాసనాలు అమలు జరుగుతాయి.
హైదరాబాద్ వైశాల్యం 82,700 చ||మైళ్లు. 1920 నాటికి జనాభా కోటి అరవై నాలుగు లక్షలు.
పేజీలు : 112