పూర్వపు హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రజలు - ఒకవైపు అత్యంత శక్తివంతమైన, నీచమైన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం. మరోవైపు దాని నమ్మిన బంటు నైజాం దాస్యశృంఖలాలలో చిక్కి వాటి పదఘట్టనల కింద నలిగిపోతుండేవారు. కృత్రిమంగా సృష్టించబడిన యీ నైజాం నిరంకుశ ప్రభుత్వం మూడు విభిన్న భాషాగ్రూపులకు అంటే తెలుగు, మరాఠి, కన్నడ భాషలు మాట్లాడే ్పజానీకానికి ఒక ఖైదుఖానాగా వుండేది. సరిహద్దు ఆవలనున్న తమ సోదరుల నుండి వారు బలవంతంగా వేరు చేయబడ్డారు. ఈ సంస్థానాన్ని ఉన్నతస్థాయిలో నిజాం, ఆయన నమ్మినబంట్లయిన నవాబులు, కింది స్థాయిలో గ్రామాలలో జాగీరుదార్లు పాలించారు. దేశముఖ్‌లు, జమీందారులు, అతి దురహంకారం, హంగూ ఆర్బాటంవున్న నిరంకుశాధికారులు నగ్నభయోద్విగ్నంగా వెలగబెట్టిన క్రూరమైన నికృష్టపాలన అది...

తెలంగాణా ప్రజలు జరిపిన మహత్తరమైన సాయుధ పోరాటం, పోలీసుచర్య, హైదరాబాద్‌లో ఆసిఫ్‌జాహి అనువంశిక నిరంకుశ పాలన అంతంకావడం, అటుతర్వాత వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై ప్రప్రథమంగా సార్వత్రిక ఎన్నికలు జరగడం, చివరగా భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వవస్థీకరణ, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు మొదలైన విషయాలు ఇందులో వివరించబడ్డాయి.

పేజీలు : 108

Write a review

Note: HTML is not translated!
Bad           Good