"కమాన్ కులకర్ణి. ఇ వాన్ట్ ఏన్ ఎక్స్‌ప్లనేషన్... మాకు చెప్పకుండా నువ్వు ఎవరిని పంపించావు?" ఉన్నట్లుండి డైరక్ట్ ఎటాక్ స్టార్ట్ చేశారు డిఫెన్స్ మినిస్టర్.
"నేను ఎవరినీ పంపించలేదు సర్... సరిహద్దులో ఏవైనా రాకపోకలు జరిగితే అవి మా కంట్రోల్‌లో ఉండవు. మీరు బోర్డర్ సెక్యూరిటీని అడగండి. లేదా మీ స్పెషల్‌బ్రాంచిని అడగండి. మా మీద కోపం చూపించినందువల్ల ఎటువంటి ఉపయోగము వుండదు..." బ్లంట్‌గా సమాధానం ఇచ్చారు కులకర్ణి.
సి.ఐ.బి.కి హోమ్ మినిస్టర్ గారు పాట్రన్ అయినట్లే స్పెషల్ బ్రాంచికి డిఫెన్స్ మినిస్టర్ గారు శ్రేయోభిలాషి.
దొంగగా జీవితాన్ని గడిపినప్పుదు స్పెషల్ బ్రాంచిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన షాడో, ఆ తరువాత కులకర్ణి గారి వత్తిడి మీద సి.ఐ.బి.లో చేరడం జరిగింది.
అతను దొంగ జీవితాన్ని వదిలేసినా, అతనిమీది కోపాన్ని స్పెషల్ బ్రాంచి వదిలిపెట్టలేదు. అతన్ని సాధించడానికి వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ కూడా ఏమీ లేదు.
అప్రతిహతంగా కంటిన్యూ అవుతోంది సి.ఐ.బి. స్పెషల్ బ్రాంచిల మధ్య ఆ బేడ్ ఫీలింగ్.
"నో... నో.... కులకర్ణి. ఐ డోన్ట్ బిలీవ్ యూ... నువ్వు ఆ షాడోని తప్పకుండా అక్కడికి పంపే వుంటావు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా వున్న పరిస్థితులు వున్నట్లుండి వేడెక్కిపోయాయంటే, అది తప్పకుండా ఆ షాడో పనే అయివుంటుంది. నథింగ్ బట్ దట్." నిష్కర్షగా అన్నారు డిఫెన్స్ మినిస్టర్.
"అల్లర్లు ఆందోళనలు చేయమని నేను ఎవరినీ అక్కడికి పంపలేదు. థగ్గుల వ్యవహారం ఇప్పటిది కాదు... చాలా రోజుల నించీ నడుస్తునే వుంది. వాళ్ళకి మాత్రం తెలిసింది ఇప్పుడే... మనం ఎవరిని పంపించినా పంపించకపోయినా వాళ్ళు తప్పకుండా మన మీదే నింద వేస్తారు. థగ్గులు స్వాతంత్ర్యం రాకముందు ఆ ప్రాంతంలో అల్లకల్లోలం చేశారు... ఒక విధంగా అది వాళ్ళ ప్లే గ్రౌండ్" నెమ్మదిగా చెప్పారు కులకర్ణి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good