ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మగువలకు తగినంత తెగువ ఉండాలని కథానాయిక మృదల పాత్ర ద్వారా చాటిచెప్పారు. కార్పోరేట్‌ రాజకీయాల్ని కార్యాలయ వాతావరణాల్ని కళ్ళకు కట్టారు. వర్తమాన పరిస్ధితుల్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ రచన మానవ సంబంధాలకూ, మనస్తత్వ విశ్లేషణకూ పెద్ద పీట వేసింది. - ఈనాడు

ఆద్యంతమూ ఆసక్తి గొలిపేలా రాశారు సుధామూర్తి. చివరకు కొంచెంద నాటకీయంగా కథను సుఖాంతం చేసినప్పటికీ వర్తమాన సమస్యను కథా వస్తువుగా తీసుకున్నందున రచయిత్రి అభినందనీయురాలు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good