ఏ రోగమునకైన ఔషధ నిర్ణయము చేయుటకు పూర్వము వైద్యుడు కొన్ని ముఖ్య విషయములను గ్రహించవలెను. బయటకు కనిపించే రోగ లక్షణములలో మాత్రమే తెలిసికొని వైద్యమెన్నడును చేయరాదు. ప్రతిరోగికి ప్రత్యేకించి యుండు కొన్ని విశేష లక్షణములు కలవు. అట్టి లక్షణములన్నింటిని రోగివద్దనుండి తెలిసికొని లేక వైద్యుడు పరీక్షించి తాను స్వయముగా గ్రహించియో వైద్యుము చేయవలెనేగాని కేవలము పైకి కనిపించే లక్షణముల బట్టి ఔషధ నిర్ణయము చేయరాదు. ఇట్టి లక్షణ సముదాయమే ¬మియోపతి వైద్యమునకు ప్రధానమైనది.
ఈ వైద్యవిధానములో ఔషధములనేక రూపములలో తయారు చేయబడును. చిన్న మాత్రలు ఇవి ఆవగింజ పరిమాణమును కలిగియుండును. కొంచెము పెద్ద మాత్రలు యివి మినప గింజ పరిమాణము కలిగి యుండును. చూర్ణములు, ద్రావకములు యివిగాక పుండ్లు, దెబ్బలు మొదలగువాటిపైకి ఉపయోగపడు పై మందులు కూడ కలవు.
మోతాదు వయసును బట్టి, రోగమును బట్టి నిర్ణయింపదగును. కాని సాధారణముగా పెద్దలకు 'ఆరు' మాత్రలు, పొడియైనచో 'ఐదు' వడ్లగింజల యెత్తు ద్రావకమైనచో రెండు చుక్కలు సుమారు ఒక ఔన్సు నీళ్ళలో కలిపి యివ్వదగును. బాలురకు 2 మాత్రలు పొడియైనచో 3 వడ్ల గింజల యెత్తు ద్రావకము ఒక చుక్క, శిశువులకు దానిలో సగము ద్రావకమైనచో రెండు చుక్కలు ఔషధమును నాలుగు చెంచాల నీళ్ళతో కలిపి నాలుగు మోతాదులుగ ఇచ్చుట సులువైన పద్ధతి...