ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతో పురోగమించిన ఆధునిక కాలంలో రసాయనిక ప్రయోగాలవల్ల ప్రత్తి గింజలకు అంటుకునియున్న నూలు ఱంపపు పొడి, వేరుశనగ పొట్టు, చెఱకు పిప్పి మొదలైన వ్యర్థ పదార్థాలను సైతం ఉపయోగించి కృత్రిమంగా వస్త్రాల తయారీ కవసరమైన దారాన్ని రూపొందిస్తున్నారు. మనం నిత్యమూ వాడుకలో చూచే నైలాన్‌, రేమండ్‌, రేయాన్‌, డాక్రాన్‌, టెరీలన్‌ మొదలైన వస్త్రాలన్నీ ఈ కోవకు చెందిన కృత్రికజన్యములే.

ఈ వస్త్రాలను రకరకాల రూపాలలో కత్తిరించి దుస్తులను చేతితో కుట్టుకోవడం దాదాపు రెండు శతాబ్దాల క్రితం వరకు వాడుకలో ఉండేది. క్రమక్రమంగా అన్ని రంగాలలో వలెనే ఈ దుస్తుల తయారీలో కూడా సాంకేతికపరమైన మార్పులు ప్రవేశించి కుట్టుపనికిగాను ప్రత్యేకమైన యంత్రాన్ని రూపొందించడం జరిగింది. దానితో కుట్టుపనిలోను దుస్తుల తయారీలోనూ ఒక నూతన శకమే ప్రారంభమయింది. అంతేకాక సాధారణంగా టైలరింగ్‌ లేక కుట్టు పనులకు మాత్రమే కాక రకరకాల అలంకరణ కుట్టు రూపొందించేందుకు కూడా ప్రత్యేకమైన యంత్ర పరికరాలు రూపొందించబడ్డాయి.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good