విద్యాసంబంధ విషయాలపై పలు గ్రంధాలు వెలువరించిన ప్రసిద్ధ రచయిత జాన్హోల్ట్. బాలల స్థితిగతుల గురించి సామాజిక కోణంలో, మనో వైజ్ఞానిక కోణంలో ఆయన ఎంతో విలువైన విశ్లేషణలు చేశారు. ఆ విశ్లేషణల ఆధారంగా వినూత్నమైన, విప్లవాత్మకమైన సూత్రీకరణలు, నిర్ధారణలు అనేకం చేశారు. 'పిల్లలు ఎలా నేర్చుకుంటారు', 'పిల్లలు ఎలా వెనకబడతారు' లాంటి ఆయన ప్రసిద్ధ గ్రంధాలను ఇప్పటికే తెలుగులో అందించిన ప్రజాశక్తి బుక్ హౌస్ ఇప్పుడు 'బాల్యం నుంచి స్వేచ్ఛ' పుస్తకాన్ని అందిస్తున్నది. పిల్లల్ని అతి ప్రేమతో లేదా అతి క్రమశిక్షణతో ఎలా నిర్భంధ బాల్యానికి గురిచేస్తున్నామో ఈ పుస్తకం వివరిస్తుంది. పిల్లల్ని స్వేచ్ఛగా పెరగనిస్తే, అలాంటి వాతావరణాన్ని కలుగజేస్తే ఎంతటి సత్ఫలితాలు లభిస్తాయో జాన్హోల్ట్ దీనిలో ఎంత సమర్ధవంతంగా పాఠకులకు తెలియజేస్తారు. - ప్రచురణ కర్తలు