మహామనిషి హోచిమిన్ శ్రామికవర్గ ఉద్యమాభిమానులందరికీ ఆదర్శప్రాయుడు, అనుసరణీయుడు. 1973లో సివి గారు అనువదించిన ఈ చిన్ని పుస్తకం అప్పటి 'మార్క్సిస్టు ప్రచురణలు' ప్రచురించింది. సామ్రాజ్యవాదుల పట్ల ద్వేషాన్ని రగిలిస్తుంది. పీడిత ప్రజానీకం పట్ల అంకిత భావాన్ని కలిగిస్తుంది. విప్లవోద్యమానికి అంకితమైన ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం ఒక పాఠ్యపుస్తకం.
హోచిమిన్ గురించి తెలియాలంటే మనకు వియత్నాం గురించి తెలియాలి. ఇండో చైనా దేశాల్లో చైనాకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న దేశం వియత్నాం. దశాబ్దాల కాలం పాటు ఫ్రెంచి, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల దోపిడీకి, ఆ తరువాత జపాన్‌, అమెరికా దురాక్రమణ దాడులకు గురైంది. సామ్రాజ్యవాద దేశాలు తమ దేశంలోని కార్మికుల శ్రమశక్తిని కొల్లగొట్టి తెగబలిసింది చాలక వియత్నాం లాంటి దేశాలను వలసలుగా చేసుకొని ఆ దేశాల సహజవనరులతోపాటు ఆ దేశాల ప్రజల్ని  కూడా పీల్చి పిప్పి చేశాయి....

Write a review

Note: HTML is not translated!
Bad           Good