ఆధునిక వైద్య విజ్ఞాన, శాస్త్ర, పరిశోధనారంగ ధన్వంతరి ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆయన అక్షరాలా ఆంధ్రుడు. అనేక కష్టనష్టాలు, సవాళ్ళు ఎదుర్కొని, అద్భుతమైన ప్రాణధార మందులను కనుగొన్నాడు. ఆరోమైసిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, టెట్రాసైక్లిన్‌, బోదవ్యాధి మందు ఆయన మానవజాతికి అందించిన దివ్య ఔషధాలు.

జీవితంలో ఎదగాలని కోరుకునే వారికి ఇంతకంటే స్ఫూర్తినిచ్చే పుస్తకం ఏముంటుంది?....- ఈనాడు

డాక్టర్‌ సుబ్బారావు సాధించిన విజయాన్ని అంచనా వేయాలంటే ఫ్లెమింగ్‌ కనిపెట్టిన పెన్సిలిన్‌ను, వాక్స్‌మాన్‌ కనిపెట్టిన స్ట్రెప్టోమైసిన్‌నూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ రెండింటినీ కలిపితే ఎంత విలువ ఉంటుందో డాక్టర్‌ సుబ్బారావు కనిపెట్టిన ఒక్క టెట్రాసైక్లిన్‌కే అంత విలువ ఉంటుందని వైద్య శాస్త్ర విశ్లేషకులు చెబుతారు. - ఆంధ్రజ్యోతి

మనకు తెలియని మహానుభావుడు .....వార్త

Write a review

Note: HTML is not translated!
Bad           Good