''చైనా సువిశాల దేవం. 'తూర్పున చీకటి పడ్డప్పుడు పడమట వెలుతురుగానే వుంటుంది. దక్షిణా చీకట్లు ముసిరినప్పుడు, ఉత్తరభాగం ప్రకాశవంతంగానే వుంటుంది. కాబట్టి, అటూ యిటూ మసలటానికి చోటుండదేమోనని తబ్బిబ్బు పడవలసిన అగత్యం లేదు.'' - మావో-సే-టుంగ్‌

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.

ఫాన్‌ షెన్‌ కథ భూమి చుట్టూ తిరుగుతుంది.

చైనా భూమి సమస్యను అర్థం చేసుకోకపోతే, చైనా విప్లవం అర్థం కాదు. చైనా విప్లవం అర్థం కాకుంటే వర్తమాన ప్రపంచం బోధపడదు.

చైనా ప్రజా రిపబ్లిక్‌ తన తొలి దినాల్లో వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మకమైన మార్పులను విముక్తి కళ్లకు కడుతుంది. రచయిత విలియం హింటన్‌ అమెరికా పౌరుడు. చైనా ప్రజల పట్ల, చైనా విప్లవం పట్ల ఎంతో అనురక్తితో ఈ పుస్తకం రాశాడు. సుమారు అరవై ఏళ్ల క్రితం చాంగ్‌ చువాంగ్‌ అనే చిన్న పల్లెటూళ్ళో జరిగిన కథ ఇది. ఆ గ్రామం ఆనాటి చైనా గ్రామసీమలకు చక్కటి ప్రతినిధి.

Pages : 255

Write a review

Note: HTML is not translated!
Bad           Good