మేడే అమరజీవుల సాహసోపేతమైన గాథను యిది సవివరంగా తెలియ చెప్తుంది. ఈ పుస్తకం చదివి నేనెంతో వుద్విగ్నుణ్ణయ్యాను. చికాగో శ్రామికులు సాగించిన మహిమాన్విత పోరాటం గురించి భారతీయ పాఠకులు తెలుసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. విషయ వివరణలో ఆయన పాటించిన పద్ధతి పాఠకుని హేమార్కెట్‌ ముందు నిలిపే విధంగా వున్నది. ప్రతి ఒక్క ఘటనకు సంబంధించిన చారిత్రక పూర్వరంగాన్ని రచయిత యిస్తాడు. తత్ఫలితంగా యీ మొత్తం వుదంతం గురించి పాఠకునికి స్పష్టత వుంటుంది.

- ఎం.కె.పాంథే

అంతర్జాతీయ కార్మికవర్గ వుద్యమంలోని అత్యుత్తమ సంప్రదాయాలను ముందుకు కొనిపోయే క్రమాన్ని మేడే కొనసాగిస్తూనే వున్నది. కనుక హేమార్కెట్‌ ఘటనయొక్క చారిత్రక విశిష్టతను కార్మిక శ్రేణుల్లో తప్పనిసరిగా ప్రచారం చేయవలసిన తిరుగులేని ప్రాధాన్యం ఎంతైనా వున్నది. ఈ స్ఫూర్తి, యజమానులతో చేతులు కలిపే కులీన కార్మిక ప్రభువులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడాలి.

Pages : 232

Write a review

Note: HTML is not translated!
Bad           Good