అత్యంత క్లిష్టమైన మార్గంలో ఎగుడుదిగుళ్లతో సాగిన రష్యన్‌ విప్లవాన్ని ఈ పుస్తకం చారిత్రక భౌతికవాద పద్ధతిలో విశ్లేషించింది. కేవలం విజయాలను మాత్రమేగాక అపజయాలను, తాత్కాలికమే అయినా వెనుకంజలను కూడా రికార్డు చేసింది. విప్లవమంటే సరళరేఖలాగా విజయ పరంపరల క్రమంలో ముందుకు సాగేది కాదని నిరూపించింది. వివిధ దశల్లో విప్లవోద్యమ వైఫల్యాలకు కారణమైన స్వీయాత్మక, వస్తుగత కారణాలను వెలికితీసి వివరించింది. అంతిమంగా రష్యన్‌ కార్మికవర్గం ఎలా విప్లవాన్ని విజయవంతం చేసిందీ వివరించిన సాధికార రచన ఇది.

అలాంటి మహత్తర విప్లవానికి ఇప్పుడు నూరేళ్లు. ఆనాటి చారిత్రక, రాజకీయార్థిక పరిస్థితుల్లో బోల్షివిక్‌ విప్లవం ఎలా విజయం సాధించిందీ ఇప్పుడు తిరిగి అధ్యయనం చేయాలి. రష్యన్‌ విప్లవ చైతన్యంతో మానవాళి ఇప్పటికీ సోషలిమే ప్రత్యామ్నాయమని ఉద్యమించవలసి ఉన్నది. ఆ స్ఫూర్తిని ప్రచారం చేయడంలో భాగంగా రష్యన్‌ విప్లవ శత వార్షికోత్సవాల సందర్భంగా ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తున్నాం.

పేజీలు : 519

Write a review

Note: HTML is not translated!
Bad           Good