తెలంగాణలో పూర్వం ఏర్పడ్డ నగరాలూ - రాజధానులూ ఎలా ఉండేవో... తెలియజేసే చిన్న గ్రంథం ఇది. ఏయే రాజులు, ఏయే కాలంలో తెలంగాణలోని తమ తమ రాజధానులను - ఎలా నిర్మించారో వివరించే ప్రయత్నం ఇది. ఈ రాజధానుల పేర్లకున్న ప్రాచీనత - అవి ఎలా రూపొందాయోనన్న అంశాలనూ పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా వర్ణితమైన గ్రంథం ఇది. ఏ మతాలు, ఏ నగరాలను ఎలా నిర్మించాయో, వీటి ప్రభావం నగరాల నిర్మాణాలలోనూ, దేవాలయాల నిర్మాణాలలోనూ, ఎలా ప్రతిబింబించాయో కళ్ళకుకట్టించే దృశ్యకావ్యం ఇది. 'అర్షశాఖ' వారి ఆధారాలను అడుగడుగునా తమ పరిశీలనాంశాలతో సంవదించుకుంటూ' వాటిని - తాను చూసినవాటికి అన్వయించుకుంటూ రాసిన చారిత్రక గ్రంథం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good