జీవితంలో కొన్ని అనుకోని అవకాశాలు మన జీవన గమనాన్నే మార్చేస్తాయి. సంవత్సరానికి కేవలం 2830 రూపాయలు ఫీజు కట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ప్రింటింగ్‌ టెక్నాలజీ చదువు నన్ను ఈ ప్రపంచంలో 12 దేశాల్లో పర్యటించటానికి దోహదం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. పోలాండ్‌లో మేనేజర్‌గా అవకాశం ఉంది, మీకు ఆసక్తి ఉందా? అంటూ ముంబై నుండి వచ్చిన ఫోన్‌ కాల్‌ నా జీవితాన్నే మార్చేసింది. పోలాండ్‌ యూరోపియన్‌ యూనియన్లో భాగం కావటంతో నేను అక్కడ పనిచేసిన కాలంలో జర్మనీ, స్వీడన్‌, ఇటలీ, లిచ్చేన్‌ స్టెయిన్‌, ఆస్ట్రియా, స్విట్జెర్లాండ్‌, ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్‌, జెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లో పర్యటించటం జరిగింది. అక్కడి సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలమీద లోతుగా అధ్యయనం చేసే అవకాశం దక్కింది. నేను సందర్శించిన దేశాల గొప్పతనాన్ని, అద్భుతాలని, క్రమశిక్షణని, అక్కడి వ్యవస్థలని వివరించేటప్పుడు

''అదే మన దేశంలో అయితేనా'' అంటూ పోల్చి మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం ఎక్కడా చెయ్యలేదు. నేను అక్కడి వ్వవస్థలని చూసి గొప్పగా చెప్పినట్లే ఇతర దేశాల వాళ్ళు భారతదేశం గురించి అంత కన్నా గొప్పగా రచనలు చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అనిపించుకునే ప్రతి దేశంలో ఉన్న వ్యవస్థలు, సౌకర్యాలు, అద్బుతాలు మనకీ ఉన్నాయి. కాకపోతే అవి చివరి వ్యక్తి వరకు చేరటంలోనే వైఫల్యం చెందుతున్నాం.

Pages : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good