ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యాన్ని సృజించిన తెలుగు రచయితలలో కుటుంబరావుది అగ్రస్ధానం.  ఆ రచనా ప్రపంచం రాశిలోనే కాక, వాసిలోనూ, వస్తు శిల్పాలలోనూ, శైలిలోనూ, పాఠకుల ఆలోచనలను ప్రేరేపించడంలోనూ కూడా అసాధారణమైనది. ఆయన తన కాలపు సామాజిక జీవనంలోని చీకటి వెలుగులను వివరించారు. మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ నీచత్వాన్నీ విశ్లేషించారు. ఆ వివరణ, వివ్లేషణ అన్ని కోణాల నుంచీ, అన్ని స్థాయిల నుంచీ లోతుగా సాగాయి. అలా పాఠకుల చైతన్యాన్నీ, అవగాహనలనూ ఉన్నతీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నం అనితరసాధ్యమైనది. ఇందులో ఆయన రాసిన చరిత్ర వ్యాసాలు ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good