గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో పద్యం, గేయం, వచన కవిత్వం, కథానిక, నవల, నాటకం, బాలసాహిత్యం, విమర్శ, పరిశోధన రంగంలో జరిగిన కృషిని పెనుగొండ పాఠకుల ముందుంచాడు. అలాగే అనువాద రంగం, సాహిత్య సంస్థలు, పత్రికలు, ప్రచురణ సంస్థల కృషిని వివరించాడు. నిజానికి ఆయా అంశాల మీద ప్రత్యేక గ్రంథాలనే వెలువరించే అవకాశం ఉంది. ఈ మొదటి భాగంలో దాదాపు వెయ్యి మంది రచయితల ముఖ్య రచనలను పెనుగొండ పేర్కొన్నాడు. రెండు, మూడు భాగాలలో సమకాలీన సాహిత్యం, సమాజంలోని ముఖ్యమైన అంశాలను విశ్లేషించారు. ఈ విశ్లేషణలో స్పష్టంగా పెనుగొండ అభ్యదయ దృక్పథం కనిపిస్తుంది. గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో భాగమైన వ్యాసాలను కూడా పొందుపరిచాడు. అనుబంధంలో ప్రత్యేకంగా కథా రచయితల, రచయిత్రుల, చలన చిత్ర రచయితలు, నటులు, విదేశాలలో సాహిత్య కృషి చేస్తున్న గుంటూరు సీమవాసుల జాబితా, అరసం గుంటూరు శాఖ నిర్వహించిన కృషి వివరాలు కనిపిస్తాయి. ` ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి
పేజీలు : 455