సావిత్రి ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆమె జీవితం అంతగా మమేకమైంది. నటిగా సావిత్రి అధిరోహించని శిఖరాలు లేవంటే అతిశయోక్తి కాదు. మంచితనం, పరోపకారం, కించిత్ అమాయకత్వం కలగలసిన వ్యక్తిత్వం ఆమెది.
త్రికాలాలకీ అతీతమైన... త్రివిక్రమ స్వరూప...
నటరాజుకి స్త్రీరూపం సావిత్రి...!
ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడొచ్చు. ఆమె నభూతో న భవిష్యతి - !
-తనికెళ్ళ భరణి
మహానటి సావిత్రి పై గతం లో అనేక పుస్తకాలు వచ్చినప్పటికీ, అవి సావిత్రి జీవితం లోని "వెలుగుల”ను చూపించినంతగా, "నీడల"ను చూపించలేదు. ఈ గ్రంధం ఆలోటును పూరిస్తుంది.
తెలుగు సినీ అభిమానులకి చిరపరిచితమైన డాక్టర్ కంపల్లె రవి చంద్రన్ కలం నుంచి వెలువడుతున్న ఈ గ్రంధం మహానటి జీవితాన్ని కొత్తగా మనకు పరిచయం చేయబోతున్నది. తెలుగు సినిమా వెలుగు నీడల్ని మనకు చూపిస్తుంది.
సావిత్రి 80వ జయంతి సంస్మరణగా ఆమె గురించి లోగడ మనకు తెలియని అనేక విషయాలతో, అరుదైన ఫోటోలతో, మంచి క్వాలిటీ ప్రింటింగుతో "సావిత్రి కరిగిపోయిన కర్పూరకళిక"ను అందిస్తున్నారు శ్రీ కంఠంనేని వెంకటేశ్వరరావు.