నా కఠోర పరిశ్రమ, పట్టువిడవని పోరాటం, చెక్కు చెదరిని ఉత్సాహం కలగలిపి విజయానందాన్ని చవిచూశాను. ఒలింపిక్‌ కాంస్య పతకం నాకు అత్యున్నత పురస్కారం. బాక్సింగ్‌ క్రీడకై  నా జీవితం అంకితం. అదే వాస్తవం. బాక్సింగ్‌ వలయంలో పలుమార్లు నాదే విజయం.

మాంగ్టే ఛుంగ్‌నైజాన్‌ మేరీకోమ్‌ భారత మహిళా బాక్సింగ్‌ రాణి. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, ఒలింపిక్‌ విజేత.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూమిలేని వ్యవసాయ కార్మిక పేద కుటుంబంలో జన్మించిన ఆమె జీవిత కథ అంతా క్రీడారంగంలో ఉత్సాహంతో కూడిన పోరాటమే. బాల్యం నుండి కఠిన శ్రమకు అలవాటుపడ్డ దేహం బాక్సింగ్‌ క్రీడకు అనువుగా ఒదిగింది. శిక్షణలు ఆమె దేహ సామర్ధ్యాన్ని ఇనుమడింపజేశాయి. భారతీయ క్రీడారంగంలోని రాజకీయాలను తట్టుకుంటూ ఆమె ధృఢనిశ్చయంతో పోరాట పటిమతో ముందుకు దూసుకుపోయింది. వేగవంతమైన కదలికలతో, పంచ్‌లతో బాక్సింగ్‌ వలయం ఆమెకు స్వాధీనమయ్యేది.

ఇప్పటి వరకు జరిగిన జీవిత సంఘటనలే ఆమె ఇందులో చెప్పింది. శ్రమతో కూడిన బాల్యం, ప్రతికూలతలు, ఆన్‌లెడ్‌తో వివాహానికి సుదీర్ఘ నిరీక్షణ అతనితో జీవితం పంచుకోవడం, పురుషుల సామ్రాజ్యమైన బాక్సింగ్‌లో ఆమె ఆధిపత్యం - ఇవన్నీ ఉత్తేజం కలిగించే ఆసక్తిదాయకమైన ఒక అసామాన్య మహిళ కథ. పురుష స్వామ్యంలో ఎదురునిలిచి గెలిచిన ధీరోదాత్త మహిళ గాధ. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good