అనాదికాలం నుంచీ ఈ దేశంలో యోధానుయోధులైన వీరులేకాదు వీర వనితలకూ కొదవలేదు. పెంపుడు తండ్రి మరణానికి కారకులైన వారిపై పగబట్టి, అనుకున్నది సాధించిన మహాధీరనాయకురాలు నాగమ్మ. ప్రేమించిన వీరుడుకోసం కన్న తండ్రినే ధిక్కరించి, అతడినే పెళ్లాడి, మోహించిన దుర్మార్గుడి చేతికి లొంగక, చితిలోకి దూకి ప్రాణాలు అర్పించిన ధీరురాలు రాణి సంయుక్త. శత్రుధాటికి వెన్నిచ్చి యుద్ధ భూమినుండి తిరిగొచ్చిన ఖడ్గతిక్కనకు కర్తవ్యబోధచేసి అమరుణ్ణి చేసిన సతి చాణమ్మ, మాత ప్రోలమ్మలు. తన రాజ్యంకోసం, భర్తకోసం, శత్రువుతో పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన రాజపుత్ర మహారాణి పద్మిని. కాకతీయ రాజ్యంకోసం అహర్నిశలూ పాటుపడిన వీరవనిత రాణీ రుద్రమదేవి. అహ్మద్‌నగర్, బీజపూర్ రాజ్యాలను పరిపాలించి ఆ రాజ్య సంరక్షణకోసం ప్రాణాలర్పించిన యోధురాలు చాందుబీబీ. తమ రాజ్య సంరక్షణకోసం కన్న కొడుకునే బలిచేసిన దాదిపన్నా. పరుషవేషం ధరించి రాజ్యపాలన చేస్తూ, అక్బర్ పాదూషాకెదురు నిలబడి పోరాడి, వీరమరణం పొందిన శౌర్యవతి దుర్గాదేవి. భర్తకోసం క్రూరమృగాలతోనూ, క్రూరులైన దుర్మార్గులతోనూ తలపడిన వీర వనిత వీరమతి. ఆంగ్లేయుల దాష్టీకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కొనవూపిరి ఉన్నంతవరకు పోరాడి నేలకొరిగిన తొలి ధీర వనిత ఝాన్సీరాణి.
ఇలా చరిత్రలో అద్భుతమైన యుద్ధ నైపుణ్యాలను, అసమాన ధైర్యసాహసాలను, శక్తియుక్తులను ప్రదర్శించిన వీరనారీమణుల జీవిత విశేషాలతో కూడిన వీరగాధల సమాహారమే ఈ 'భారత వీర నారీమణులు' పుస్తకం.
పేజీలు : 100