అమెరికా స్వభావానికి అద్దం పట్టే ఈ పుస్తకాన్ని ఎవరికీ అరువీయకండి. కానీ, మీకు పరిచయమున్న ప్రతిమనిషి దీన్ని చదివేలా చేయండి. ఈ మహాయజ్ఞంలో మీరు పొందగలిగే ఫలితాలు రెండున్నాయి. తెలుగు పుస్తకాలను చదవడం మానేసి, టీ.వీ.లకు అప్పగించిన కళ్ళను తెలుగు అక్షరాలమీదకి మళ్ళించడం మొదటి ప్రయోజనం. సంపాదన కోసం అనురాగాన్ని బలిచేసి, తమ సంతానాన్ని అమెరికాకు పంపాలనే ప్రయత్నంలో సాముగరిడీలు చేస్తున్న తల్లిదండ్రులకు ఆ అమెరికా గురించి కాసింత కనువిప్పు కలిగించడం రెండో ప్రయోజనం. ఈ ఆశయాన్ని ఆమోదించే తెలుగు ప్రజలకు నమ్రతతో నమస్కరిస్తున్నాం.

ఎం.వి.రమణారెడ్డి బహుముఱ ప్రజ్ఞాశాలి. 1944లో జన్మించిన ఆయన వైద్య విద్యను అభ్యసించిన తర్వాత 'లా' చదివి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. కార్మికనేతగా, క్రియాశీల రాజకీయవేత్తగా సుప్రసిద్ధులు. రచయితగా, సృజనశీలిగా విలువైన రచనలను తెలుగు పాఠకులకు అందించిన ఆయన రాయలసీమ వెనకబాటుతనాన్ని మొట్ట మొదటగా గణాంకాలతో సహా ప్రజల ముందుంచారు. పరిష్కారం కథల సంపుటి, రాయలసీమ కన్నీటి గాధ, తెలుగు సినిమా - స్వర్ణయుగం వీరి రచనలు. పాపియాస్‌కు వీరి తెలుగు అనువాదం రెక్కలు చూచిన పంజరం, పురోగమనం పేరెన్నికగన్నవి. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరులో నివసిస్తున్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good