1945, ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా, 9న నాగసాకీ నగరాలపై అమెరికన్‌ సామ్రాజ్యవాదులు అణుబాంబులువేసి, తాము ప్రపంచంలో ఒక అమేయమైన శక్తి అని చాటుకునే ప్రయత్నానికి పాల్పడ్డారు. ఈ బాంబులు అసంఖ్యాక ప్రజానీకాన్ని చంపాయి. అనేకమందిని శారీరక, మానసిక వైకల్యానికి గురిచేసి, వారు ర్బతికున్నంతకాలం, సరైన తగు చికిత్స లబించక, జీవచ్ఛవాలుగా కాలం వెళ్ళ బుచ్చాల్సిన దుస్థితికి గురయినారు. బాంబు యొక్క రేడియేషన్‌ ప్రభావంతో శాశ్వత అనారోగ్యం బారిన పడి జీవించిన వారికంటే, ఆ బాంబు దాడిలో మరణించినవారే అదృష్టవంతులు అనే అభిప్రాయానికి రావటాన్ని బట్టిచూస్తే ఆ బాంబులు మానవశరీరాలను, మనస్సులనూ, వాతావరణాన్నీ ఎంతగా కలుషితం చేశాయో అర్థమౌతుంది.

అణుబాంబుతో పైశాచికదాడి జరిపిన అమెరికన్‌ సామ్రాజ్యవాదులు, బాంబు యొక్క రేడియేషన్‌ ప్రభావం పడి తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి తగు చికిత్స కల్పించేందుకు ప్రయత్నించకపోగా, ఆ రోగులపై అనేక పరీక్షలు జరిపి, అణుబాంబులు మానవునిపై కలుగచేసిన విషప్రభావాలను అర్థం చేసుకొని, వారి పరీక్షల్లో తేలిన ఫలితాలూ, నిర్ధారణల ఆధారంగా, వాటిని మరింత ప్రతిభావంతంగా యుద్ధాల్లో ఏ విధంగా వాడుకోవాలో అన్న విషయాన్ని అధ్యయనం జరిపారు.

అణుబాంబు ప్రయోగం విష ఫలితాలను ఈ నవల వివరించింది. అణువిద్యుత్‌ కర్మాగారాలలో ప్రమాదాలు కూడా అంతటి విధ్వంసాన్ని చేయగలవని ఇటీవలి అనుభవాలు తెలుపుతున్నాయి. ఛెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కర్మాగార ప్రమాదం జరిగి మూడు దశాబ్దాలు దాటింది. దాని నుండి రేడియేషన్‌ వెలువడకుండా కర్మాగారం చుట్టూ రెండడుగుల మందం కాంక్రీటుతో నింపారు. అయినా రేడియేషన్‌ వెలువడుతున్నదని తెలియటంతో ఈ ఏడాది దానిని ఆరంగుళాల మందపు ఇనుపరేకుతో కప్పివేస్తున్నారు. తక్షణ నివారణ చర్యలు తీసుకున్నందున పుకుషిమా అణు ప్రమాదంలో ప్రజలపై రేడియేషన్‌ ప్రభావం లేదని చెప్పుకున్నారు. కానీ దాని నుండి వెలువడిన రేడియేషన్‌ నుండి క్యాన్సర్‌ ఏర్పడిన కేసులు ఈ ఏడాది వైద్యరీత్యా నమోదయ్యాయి. ఏది ఏమైనా ఇక అణువిద్యుత్‌ కర్మాగారాలు పెట్టేదిలేదని జపాన్‌ ప్రకటించింది....

అణువిద్యుత్‌ ప్రమాదపు అగ్నిపర్వంతపై బలవంతంగా మనదేశం లోని అనేక ప్రాంతాలు ఉంచబడి, వినాశనానికి చేరువలో వున్న నేటి తరుణంలో, ఈ హిరోషిమా నవల ససందర్బమయినది. యిప్పటికిప్పుడే దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తుతున్న ప్రజా ఆందోళనా - ఉద్యమాలకు ఈ నవల ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంటుందనే ఉద్దేశ్యంతో దీనిని పాఠకులందిస్తున్నాం.

  - జనసాహితి

Pages : 142

Write a review

Note: HTML is not translated!
Bad           Good