సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు స్వామిరామ ఇంగ్లీషులో రాసిన లివింగ్‌ విత్‌ ది హిమాలయన్‌ మాస్టర్స్‌ గ్రంధానికి చక్కని తెలుగు అనువాదమిది. హిమాలయ ఋషుల మహిమాన్విత సంప్రదాయాల నుండి వచ్చిన మహనీయుడు స్వామిరామ. హిమాలయాలలో స్వామీజీ పెరిగిన వాతావరణాన్ని, హిమాలయ ఋషుల జీవితాలను, వారి బోధనలను ఈ గ్రంధం మనసుకు హత్తుకునేలా తెలియజేస్తుంది. 'గుహలలో మేము ఎలాగ జీవిస్తాము', 'శిష్యులను గురువు ఎలా పరీక్షిస్తారు', 'మంటలు కురిపించే స్వామి', 'వార్ధక్యం లేని యోగి', 'హిమాలయాలలో క్రైస్తవ ఋషి', హిమాలయాలలో క్రీస్తు', 'ఒక నాస్తిక స్వామి', శరీరాన్ని విడిచిపెట్టే విధానాలు - ఇందులోని అధ్యాయాల్లో మచ్చుకు కొన్ని. స్వామి అజయ కూర్చిన ఈ గ్రంధానికి తేటతెనుగులో చక్కని అనువాదం చేసింది భాగవతుల వేంకట శ్రీనివాసరావు. ఆధ్యాత్మిక బిజ్జానువులు తప్పక చదివి తీరవలసిన గొప్ప గ్రంధం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good