ప్రతి సంవత్సరం ఈశా ధ్యానులు జట్టుగా కలసి హిమాలయ యాత్రకు వెళుతారు. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు చేపడుతూ వస్తున్న యాత్ర ఇది. ఈ యాత్రికులు హిమాలయాల పట్ల ఒక నిర్బంధ వ్యామోహానికి లోనౌతారు. ఈ వ్యామోహం పురాతన కాలం నుంచీ ఉంది. ఈ వ్యామోహం సాహసం చేయడం కోసం కావచ్చు. అత్యద్భుతం, అతి స్ఫూర్తిదాయకం అయిన ప్రకృతితో ముఖాముఖీ రావడం కోసం కావచ్చు. నిర్జనారణ్యపు హృదయంలోని స్తబ్ధతను రుచి చూడడం కోసం కావచ్చు, లేదా వీటన్నింటి కోసం కావచ్చు. పర్వతారోహకులు, అన్వేషకులు, భక్తులు, సాధువులు, సంచార జాతుల వాళ్ళు, యోగులు - అందరిలో ఆకాశాన్నంటే ఈ అద్భుత భూభాగాన్ని అనుభూతి చెందాలనే బలమైన ఆకాంక్ష ఉన్నట్లు అనిపిస్తుంది.
ఈ పుస్తకం కేవలం హిమాలయాలను గురించే కాదు. అయినా హిమాలయాలు లేకపోతే ఈ పుస్తకం ఉండేదికాదు. ఒకసారి విషయంగా, ఒకసారి ప్రేరణగా, ఒకసారి అలంకారంగా, ఈ రచనలో పర్వతాలు ఒక్కొ&్కసారి ఒక్కోపాత్రను నిర్వహిస్తాయి. అవి లేకుండా ఈ పుస్తకంలో కొన్ని ప్రశ్నలకు తావే లేదు. కొన్నిసార్లు అవి మనం అడుగుతున్న దానితో సంబంధం లేనివిగా తోచవచ్చు. అయినా అవి అంతర్లీనంగా ఈ పుస్తకానికి ఆధారంగా నిలిచాయి.
సద్గురు : యోగి, మర్మజ్ఞుడు, దార్శనిక వేత్త అయిన సద్గురు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక గురువు. మంత్రముగ్ధులను చేసే వారి ప్రగాఢ జ్ఞానం - కార్యసాధనా శైలీ, వారి జీవితం - వారి కార్యకలాపాలు, 'యోగా' అంటే ఏదో పురాతన నిగూఢ శాస్త్రం కాదని, ఈ రోజుల్లో కూడా మనకు చాలా ఉపయోగపడే ఒక సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. సద్గురు ప్రసంగాలు ఆయనకు ఒక గొప్ప వక్తగా, అభిప్రాయ నిర్మాతగా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. అందరికీ తక్షణ, అలాగే శాశ్వత శ్రేయస్సులను అందించాలనే ధ్యేయంతో సద్గురు ఈశా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్ధను స్ధాపించి, దాని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good