బీపికి సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం ఈ పుస్తకంలో లభ్యం అవుతుంది.

''నాకు 'బిపి' ఉంది'' అంటుంటారు చాలామంది.

బిపి అటే రక్తపీడనం - బ్లడ్‌ ప్రెషర్‌. రక్తనాళాలలోంచి ప్రవహిస్తున్నప్పుడు రక్తం మీద పడే వొత్తిడిని 'బ్లడ్‌ ప్రెషర్‌' అంటారు.

బిపి ప్రతి మనిషికి ఉంటుంది. ఉండాలి కూడా. బిపి లేకపోతే ఆ మనిషి శరీరంలో రక్తప్రసారం ఉండదు. రక్త ప్రసరణ లేకపోతే శరీరంలోని ముఖ్యావయావాలకు అవసరమైన ఆక్సిజన్‌, పోషక పదార్ధాలు లభించవు. దానితో శరీరం మూలన పడుతుంది.

గుండె, రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తాన్నీ కలిపి వైద్య పరిభాషలో కార్డియోవాస్క్యులార్‌ సిస్టమ్‌ అంటారు. మన గుండె ఒక విధమైన నీళ్ళు తోడే పంపులాంటిది అంటే అతిశయోక్తి కాదు. బలమైన కండరంతో నిర్మితమై ఉన్న పంపు మన గుండె.

శరీరానికి ప్రాణాధారమైన గుండె పిడికిలికంటే కొంచె పెద్ద సైజులో ఉండి ఛాతీ మధ్యభాగంలో కొంచెం ఎడమవేపున, రెండు ఊపిరితిత్తులకూ మధ్యగా అమరి ఉంటుంది....

Pages : 159

Write a review

Note: HTML is not translated!
Bad           Good