''నీడతో యుద్ధం'' అనే పేరిట, రంగనాయకమ్మ గారు 1980 డిసెంబరులో ప్రచురించిన పుస్తకంపై వొహ బొమ్మ ఉంది. రంగనాయకమ్మ గారి లేకి మనస్తత్వానికి ఈ బొమ్మ పతాక సంకేతం మాత్రమే. చాపల మార్కెట్‌లో బొమ్మిడాయిలూ, మట్టగుడిసెలూ అమ్ముకునే స్త్రీ ప్రదర్శించే చిల్లరతనమే. ఈ బొమ్మలో సైతం కానవొస్తుంది. ఎవరెస్టు శిఖరమంత ఉన్నతమైన సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి చెందిన నేను, యింతకన్నా ఎక్కువగా ఆ బొమ్మను గూర్చి రాయడం, నా స్థాయిని నేనే దిగజార్చుకోవడం కాగలదు.

    మతం - ప్రజల పాలిట మత్తుమందు అనీ, మత విమర్శ అని విమర్శలకీ నాంది అనీ. మార్క్సిస్టు సిద్ధాంత మూల పురుషుల్లో వొహడైన మార్క్స్‌ స్పష్టంగా చెప్పగా; మతానికి వ్యతిరేకంగా యావత్‌ కష్టజీవుల్నీ సమీకరించి, వారిని శాస్త్రీయ పంథాలో ఎడ్యుకేట్‌ చేసి తీరాలని మార్క్సిస్ట్‌ సిద్ధాంత మహోపాధ్యాయుడైన లెనిన్‌ నిర్ధ్వంద్వంగా హెచ్చరించగా, ''మతమా! ఛీ! ఛీ! నశించు నశించు!!'' అని ఈమె తన పుస్తకంపై బొమ్మ గీయించడం సిగ్గుచేటు కాదా? - సి.వి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good