బాల్యంలో ఏర్పడిన భావాలు భావి జీవితానికి ప్రాతిపదికలు. 'నిరాశా నిస్పృహలకు తావు ఉండరాదు. సమస్య వచ్చినపుడు క్రుంగరాదు. అనుకోని అవరోధాలు, ప్రకృతి కల్పించిన అవకరాలు అన్నీ అధిగమించి జీవితాన్ని సుగమం చేసుకుంటూ గమ్యం చేరుకోవాలి. చీకటిలో వెలుగును చూడగలిగే ధైర్యం. స్థైర్యం, ఆత్మవిశ్వాసం - ఈ మూడూ మనిషి ఉన్నతికి సోపానాలు' - ఇదీ హెలన్‌ కెల్లర్‌ జీవితసారం!
ఈ సారాన్ని నీరవమైన నేటి తరానికి అందించాలన్నదే ఈ రచయిత్రి తపన. అయితే దీనికి పాఠకులు బాలలు కనుక ఆ చెప్పడం కేవలం ప్రబోధాత్మకం గాను. సూక్తి ముక్తావళిగాను ఉండరాదు, దానికొక విశిష్టమైన, విభిన్నమైన తీరు, తెన్ను ఉండాలి. అప్పుడే అది పసి మనసులలో చెరగని ముద్ర వేయగలుగుతుంది. వారి భావాలను ప్రభావితం చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే!
పిల్లల మనసుకు రుచించేది కథ. హెలెన్‌ కెల్లర్‌ జీవితగాథ కాల్పనికమైన కథ కంటే అద్భుతమైనది. అందుకే ఆవిడ జీవితాన్ని బాలలకు వినిపించాలనే ఈ తాపత్రయం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good