ప్రక్రుతి కి దగ్గాగా ఉంటూ సహజమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని మన భారతీయ సంస్కృతి అనాదిగా చేబుతూనేవుంది. ఈ రోజున ఆహారం వానిజ్యపు సరుకుగా మారిపోవడం శోచనీయం. చాలా మంది సహజమైన ఆహారాన్ని గుర్తించే స్థితి లో లేరు. మనిషి కోసం ఆహారమా? ఆహరం కోసం మనిషా? అనే పరిస్థితి దాదాపుగా పరిణమించింది మనకు గల వినోదాల్ల్లో తిండి తినడం కూడా ఒకటైన దారుణ పరిస్థితి ఏర్పడింది. రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, ఆహారం పేరిట విషపూరిత , వ్యర్ధపదార్దాలు కూడూ తినడం ఫాషనైపొయిది. అన్నింటి కంటే దారుణం - ఇంట్లో కన్నా వెలుపల తినే సంస్కృతి బాగా వేళ్ళూ నికుంది . ఈ పరిణామాలతో ఆరోగ్యానికి అనివార్యంగా తూట్లు పడుతున్నాయి. అస్వస్థతలు వ్యాధులుగా బయల్దేరిన తర్వాత పూర్తిగా ఆశక్తులమైపోతున్నాం. దీర్ఘకాలం నుంచి ఆహార అంశం మీద అధ్యయనం చేస్తూ, వివిధ ఆరోగ్య సంబంధ పత్రికలలో వ్యాసాలూ రాసిన ప్రసిద్ద సీనియర్ పాత్రికేయులు శ్రీ వాసవ్య గారు మేము కోరినంత నే మీ ఆహారం తోనే మీ ఆరోగ్యం గ్రంధ రచన చేశారు.సూర్యోదయం, సూర్యాస్తమయానికి అనుగుణంగా పనిచేసే మన శరీరంలోని జీవన గడియంలో ఆహారం కారణంగా మార్పులు వస్తాయని 2008 ఆగస్ట్ నాటి అధ్యయనంలో కూడా వెల్లడైంది. ఈ గ్రంధ రచనే పాఠకులకు ప్రయోజనకరం కాగలదని మా దృఢ విశ్వాసం , ఆహారం అంశం మీద ఇంతటి సమాచార విశ్లేషణ గ్రంధాన్ని అందించిన శ్రీ వాసవ్య గారికి మా కృతజ్ఞతాభి వందనాలు. |