ప్రస్తుత జీవన విధానంలో మానవునికి విశ్రాంతి కరువైంది. సమయానికి తినలేడు. నిద్ర పోలేడు. సంపాదన పరుగులో బాంధవ్యాలకు దూరమై, స్థాయికి మించిన ఒత్తిడితో, హద్దులు దాటిన ఆశలతో ఆతృత, ఆందోళన, అలసటతో సతమతమవుతున్నాడు. వీటి పరిష్కారం కోసం మత్తు మందులు, మద్యం, సిగరెట్లు, గుట్కాలకు బానిసవుతున్నాడు. పై రుగ్మతల మూలంగా శరీరంలోని ప్రతి అవయవయం వ్యాధుల బారినపడి అనారోగ్యం పాలవుతున్నాడు. అనుభవించడానికి అన్నీ ఉండి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాడు.

ఈ ఆధునిక యుగంలో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ పని ఒత్తిడితో బి.పి., షుగర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, ఊబకాయం లాంటి వ్యాధులతో 40 సం||లకే ముసలి ప్రాయానికి దగ్గరవుతున్నాడు.

ఈ పరిస్థితులలో రోజుకు 18 గం||లకు పైగా పనిచేస్తూ, ముఖంలో అలసట, చిరాకు కనిపించని మన ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ, అనునిత్యం యోగాభ్యాసం ఆదర్శంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. పాతిక సంవత్సరాల పత్రికానుభవంతో నేనే యోగాసనాలు వేస్తూ ప్రయోగాత్మకంగా వ్రాశాను. మంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, పరిశుభ్రమైన గాలి, నీరు, ఆహారం, నిద్ర, వ్యాయామం, కుటుంబ జీవనం, సామాజిక సేవలతో జీవనం సుఖమయమౌతుందని భావిస్తూ వివేకానందుని స్ఫూర్తితో ప్రతి పేజీలో విలువైన సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తక పఠనంతో మీరూ ప్రతిరోజూ యోగాభ్యాసం చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాఉడకుంటారని ఆశిస్తూ...

- యం.మాధవరావు

పేజీలు : 140

Write a review

Note: HTML is not translated!
Bad           Good