Rs.250.00
In Stock
-
+
ప్రజాహితైక పక్షపాతియగు నాశ్రియ:పతి యాదికాలమున నేకాన్తసాధన ధనమగు నాయుర్వేదమును సృజించెను. అయ్యది యనేకవిధములగు చికిత్సాభాగములతో గూడియున్న ప్రాజ్ఞులకందరకును విదితమే.
అందలి చికిత్సా పద్థతులను సృష్టియందలి ఖనిజ ప్రాణిజ కాష్ఠౌషధులను గ్రమముగ మహర్షులు వారివారి సమయములయందు పెక్కు పరిశోధనల నుండియు జ్ఞానదృష్టినుండియు గనుంగొనిరి. మహర్షులు పై జెప్పిన మూడు విధములగు పదార్థములచే వాత పిత్త కఫములనెడి దోషత్రయముయొక్క సామ్యాదిస్థితిని యెట్లు కన్గొనిరను విషయమునుగురించి యించుక విమర్శింతము.