చదరంగం ఆడడం మీకు వచ్చా? రాకపోతే నేర్చుకోండి. చదరంగం ఆటలోని మొదటి ఎత్తులు యెలా వెయ్యాలో యీ ''మొదటి ఎత్తు'' పుస్తకం మీకు నేర్పుతుంది.

ఇదివరకే మీకు ఆడడం వచ్చా? అయితే యింకా మెరుగు పరుచుకోవడానికి యిందులో వున్న అభ్యాసాలు సాయపడతాయి. చదరంగం ఆట అంటే అందరికీ ఆసక్తే. ఇది ఒక శాస్త్రం, ఒక క్రీడ, ఒక కళ - మనిషి ప్రతిభావిశేషాలకి గీటురాయి. క్రమపద్ధతిలో ఆలోచించడం, అవతలి మనిషి యెత్తుల్ని వూహించడం, వాటికి ప్రతిగా యెత్తులు వెయ్యడం నేర్పుతుంది. వినోదాన్ని యివ్వడమే కాదు, మీ విశ్లేషణాశక్తినీ పెంపొందించే స్ఫూర్తి - మొదటి ఎత్తు.

చదరంగం ఆట ప్రపంచంలోనే యెంతో ఆదరణ పొందింది. బాలల నుండి పెద్దల వరకు యీ ఆట అంటే ఆసక్తే చదరంగం ఆడేందుకు ఎక్కువ సరంజామా కూడా అక్కర్లేదు. ఎక్కువ ఖర్చూ చెయ్యక్కర్లేదు.

అలాగే దీనికి దూరాభారాలు లేవు. ఉత్తరాల ద్వారా వేలవేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటగాళ్ళతో కూడా ఆడవచ్చు.

ఒక్కళ్లూ కూడా ఆడుకోవచ్చు. ప్రఖ్యాత ఆటగాళ్ల ఆటలు పరిశీలించి ఆ మిళితాల్ని, విశ్లేషణల్ని, మెలకువల్ని ఆపోశన పట్టి మీ అంతట మీరే యీ పుస్తకంలోని అభ్యాసాల ద్వారా మీ ఆటను మెరుగు పరుచుకోవచ్చు.

మరి! ఆలస్యం దేనికి!

వెయ్యండి మీ ''మొదటి ఎత్తు''!!

చెయ్యండి ఎదుటివారిని చిత్తు!!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good