విజ్ఞానమును మానవాళికి అందించుటలో వారి జీవితాలే త్యాగ జ్యోతిగా వెలిగించారు .హోమియోపతి మందు ఎంచి రోగికి ఇచ్చుటకు మేటీరియా మెడికా సన్నిహిత సంబంధం గలిగి ఉండి ఎల్లప్పుడు చదువు చుండుట వలన ఔషధ లక్షణములు బాగా జ్ఞాపకము ఉండి మందు ఎన్నుకొనుట సులువు అగును. నా  అనుభవములో లక్షణ సూచన కంటే వస్తు గుణ దీపిక అధ్యాయమే మేలు. ప్రతి రోగి చరిత్ర  రికార్దులుగా వ్రాసుకొని ఉంచుకొనవలెను. మేటీరియా మెడికా చదువునపుడు ఏ రోగి లక్షణములు సారుప్యాముగా కనిపించిన వెంటనే ఆరోగి రికార్డులో ఆ మందును నోటు చేసుకొనవలెను. ఇట్లు చేయుటవలన రోగి వచ్చినపుడే మందు వెతుకు కొనుట ఉండదు. మనకు అనుభవము, ప్రవీణత కూడూ వచ్చును. హోమియోలో అనేక మందులు ఉన్నాయి. కాని మదరు టించర్లు గా ఉపయోగపడేవి. ద్వాదశ లవనములు మాత్రమే ఈ పుస్తకంలో రచించినాను. వీటిని మదురు టించర్లుగానే గానే 30,200 వెయ్యి పవరులలో కూడూ వాడవచ్చు హోమియో వైద్యము అనుకొన్నంత సులువు కాదు. అనుభవము గ వైద్యులు సలహా సహకారములతో కష్టపడి వస్తు గుణ దీపికను పటించాలి. రోగాన్ని, బాధని నివారించ గల సామర్ధ్యము వైద్యుడు కలిగి వుండాలి. కొన్ని మందులు రిపార్టరి యందు దొరకవు. రోగిలోని వ్యాధి లక్షణములు మందులో గల సారువ్య లక్షణము సరిచూచటలో ముఖ్యముగా రోగి బాధ లక్షణములలో ఉద్రేక, ఉపశయనము ప్రధానము. మందు ఎగ్రివేషన్ వస్తే ఆ ఉద్రిక్తత తగ్గించుటకు విరుగుళ్ళు మందు అవసరము. అందుకు ప్రతి మందుకు వాటిని సూచించుట జరిగినది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good