ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్‌, పక్షవాతం, మెదడులో ట్యూమర్లు తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు. ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స లభించడంలేదు. నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు, ఎందరో స్పెషలిస్ట్‌ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఎన్నో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. అయితే సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం కారణంగా సరైన చికిత్స అందడం లేదు. ఈ కారణంగా చాలామంది దీర్ఘకాలం వ్యాధులతో బాధపడుతున్నారు.

    ఫిట్స్‌ సాధారణ సమస్య. కాని సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో అపోహలు ఉన్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, వివాహం, పిల్లలను కనడం మొదలైన అనేక విషయాల్లో అనుమానాలున్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేయడానికి, సమాజానికి నా వంతు కృషిగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. - డాక్టర్‌ ముదిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good